8 July, 2026 | 7:53 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

ఏసీబీ వలలో సివిల్ సప్లు డిప్యూటీ తహసీల్దార్

18-11-2025 12:00 AM
  1. రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
  2. సహకరించిన అసిస్టెంట్, రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్
  3. భద్రాద్రి జిల్లా ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయంలో దాడులు 

ఇల్లెందు, నవంబర్ 17(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా, అసిస్టెంట్ విజయ్, రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు శబరీష్ లను అరెస్ట్ చేశారు.

గత నెలలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా ఒక రేషన్ షాపును తనిఖీ చేసి స్టాక్ తక్కువ గా ఉందని కేసు నమోదు చేశారు. ఆ సమయంలో షాపును సీజ్ చేశారు. ఆ షాప్ తిరి గి ఇచ్చేందుకు రూ 30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

విజయ్ అనే అసిస్టెం ట్ ద్వారా డబ్బులు అడిగించారు. అసోసియేషన్ అధ్యక్షుడు శబరిష్ ద్వారా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా, అసిస్టెంట్ విజయ్, శబరిష్ లను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.