18 May, 2026 | 2:10 AM

బ్లాక్ మెయిల్ షురూ

18-05-2026 12:59 AM

వరుణ్ సందేశ్, జెమిని సురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్లాక్ మెయిల్’. హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ గుండ్రెడ్డి రచనాదర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేశ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు.

జీఎస్ చక్రవ ర్తిరెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్రరెడ్డి ఎడిటర్ కాగా, ఎస్‌వీ మల్లిక్ తేజ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభ మైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట, సీనియర్ నిర్మా త భరద్వాజ్, వెంకట సుబ్బలక్ష్మి, నటీనటులు రక్షిత్ అట్లూ రి, శ్రీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరు ణ్ సందేశ్ మాట్లాడుతూ.. “దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు మంచి కంటెంట్‌తో సిని మా వస్తుందని అర్థమైయింది. త్వరలో చిత్ర షూటింగ్ మొదలు కాబోతుంది” అని అన్నా రు.