కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
06-04-2026 04:31 PM
ముకరంపుర,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యపురి కాలనీలోని తన నివాసం వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి & డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.




