6 April, 2026 | 8:05 PM

వ్యక్తిత్వ వికాసం, టైమ్ మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్ పై అవగాహన

06-04-2026 06:18 PM

గుండాల,(విజయక్రాంతి): స్థానిక టీజీ టీడబ్ల్యూఆర్ఎస్ గుండాల గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు సుమారు 150 మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టైమ్ మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, తల్లిదండ్రుల గొప్పదనం, అన్నం విలువ వంటి ముఖ్య అంశాలపై విద్యార్థులకు స్పష్టమైన మార్గ నిర్దేశం ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్లు బి.కర్ణ, బి.మురహరి చేశారు. వారు విద్యార్థులకు జీవితంలో లక్ష్యాలను ఎలా ఏర్పరచుకోవాలి, సమయాన్ని ఎలా సమర్థంగా వినియోగించుకోవాలనే విషయాలను ఉదాహరణలతో వివరించారు. అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల గౌరవం, అన్నం విలువను గుర్తించుకోవడం వంటి విలువలను కూడా ప్రాధాన్యతగా తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ ఇస్లావత్ సురేష్, సిబ్బంది ట్రైనర్లను అభినందించారు.