21 March, 2026 | 1:03 PM

Breaking News

'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •   3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!   •   అందరికీ అన్నీ.. రాష్ట్ర బడ్జెట్ 2026-27   •  

కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్

21-03-2026 11:01 AM

శివంపేట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మండలంలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన బండారి గంగాధర్ శుక్రవారం నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో, సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటున్న బండారి గంగాధర్ సేవలను గుర్తించిన రాష్ట్ర పార్టీ ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నగారి ఆంజనేయులు గౌడ్ నియామకపత్రం అందజేశారు.

ఈసందర్భంగా జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన బండారి గంగాధర్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు జిల్లా కమిటీలో స్థానం కల్పించడం తన అదృష్టమన్నారు. జిల్లా పదవి అప్పగించి కాంగ్రెస్ పార్టీ తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. తనకు అధికార ప్రతినిధిగా పదవిని అప్పగించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.