calender_icon.png 22 February, 2026 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీలో భద్రాద్రి జిల్లాకు సముచిత స్థానం

21-02-2026 10:20:05 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): ఏఐఎస్ఎఫ్ రాష్ట్రకమిటీలో భద్రాద్రి జిల్లాకు సముచిత స్థానం దక్కింది. రాష్ట్ర సమితి సభ్యులుగా జిల్లాకు చెందిన వరక అజిత్, ఎస్ కే షాహీద్, గండాల సుజన్, ఇనంపల్లి సాయి, మాణిక్యాల వినయ్, గగులోతు వంశీ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర నాల్గవ మహాసభలు నిజాంబాద్ జిల్లా వేదికగా జరిగాయి. ఈ మహాసభల వేదికగా ఈ ఎన్నిక చోటు చేసుకుంది. నూతనంగా విద్యారంగంలో వస్తున్న మార్పులపై సమరశీల  పోరాటాలకు సిద్ధం కావాలని ఈ మహాసభ పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా రాష్ట్రకమిటీకి ఎన్నికైన విద్యార్ధి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి విద్యారంగం పట్ల సరైన విధానం లేదని, ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోనేలా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని నింపడం కోసం కృషి చేస్తామని, మతోన్మాద భావాజాలాన్ని విద్యాసంస్థల్లో అరికట్టేందుకు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. భద్రాద్రి జిల్లా అంటేనే  కమ్యూనిస్టులకు కంచుకోటని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో, జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా సూచనలు, సలహాల మేరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు.