హాల్ టికెట్ ఇవ్వలేదని.. బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
- శ్రీ హిందూ ఇంజినీరింగ్ కాలేజ్ లో ఫీజుల వేధింపులు
- హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
అబ్దుల్లాపూర్ మెట్/ ఎల్బీనగర్: పరీక్షలు రాయడానికి హాల్ టికెట్ ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్ర్రానికి మ్యాదరి ప్రణీత్ కుమార్ (22) రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని శ్రీ ఇందూ కాలేజీలో సీఎస్సీ-డీ బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు.
పరీక్షల సమయం ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో మనస్థాపానికి చెందిన ప్ర ణీత్ శనివారం రాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నామని హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ నాగరాజు గౌడ్ తెలిపారు.






