సమర్థ పాలనకు 99 యాక్షన్ ప్లాన్
- అమలుకు డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్‌గా క్యాబినెట్ సబ్ కమిటీ
- సభ్యులుగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో పాలన మరింత సమ ర్థవంతంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధశాఖల్లో అమ లు చేయాల్సిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (99 డేస్ యాక్షన్ ప్లాన్) రూపొందించి అమలుచేయడానికి క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేసి అమలు దిశగా అడుగులు వేయనుంది.
ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ కమిటీకి ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అవసరాన్ని బట్టి ఆర్థికశాఖతో పాటు సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కమిటీ సమావేశాలకు హాజరవుతారు.
రాష్ట్ర అభివృద్ధి ని వేగవంతం చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలను కాలపరిమితిలో అమలు చేయ డం లక్ష్యంగా ఈ యాక్షన్ ప్లాన్‌ను అత్యం త ప్రాధాన్యతతో రూపొందించి, వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే కమిటీ సమావేశమై అన్ని శాఖలతో సమీక్ష జరిపి వివరమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనుంది.




