13 June, 2026 | 3:00 AM

బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

12-06-2026 01:27 PM

ఇల్లందు, జూన్ 12 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనను జనసేన పార్టీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మద్ది సాయికుమార్ మాట్లాడుతూ చిన్నారి జీవితాన్ని ఛిద్రం చేసే ఇటువంటి దారుణాలకు నాగరిక సమాజంలో స్థానం లేదన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు కుటుంబానికి పూర్తి భద్రత కల్పించి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆంగోత్ శ్రీను, మద్ది సాయికుమార్, ముత్యాల వీరబ్రహ్మం, ఆవుతుర్తి శ్రావణ్, మధు యాదవ్, కాయం శాంతికుమార్, హేమంత్, బానోత్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.