28 August, 2026 | 10:48 AM

ప్రతి బీసీ కులానికీ ప్రత్యేక కోడ్ ఇవ్వాలి

28-08-2026 01:04 AM
  1. చట్టసభల్లో వాటా లేకుండా బహుజనులకు న్యాయం జరగదు
  2. డాక్టర్ జే పూర్ణచంద్రరావు
  3. ‘ఓబీసీల పోరుబాట2’ పుస్తకావిష్కరణ  

ముషీరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాం తి): బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఎదగడంతో పాటు రాజకీయ రంగంలోకి పెద్దఎత్తున ప్రవేశించి అధికారంలో తమ న్యాయమైన వాటాను సాధించుకోవాలని మాజీ డీజీపీ డాక్టర్ జే  పూర్ణచంద్రరావు(J. Purnachandra Rao) పిలుపునిచ్చారు. బీసీ టైమ్స్, జన అధికార సమితి సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి పి. నరహరి రచించిన ‘ఓబీసీల పోరు బాట2’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తం గా చేపట్టనున్న కులగణనలో ప్రతి బీసీ కులానికీ ప్రత్యేక కుల కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కులాలను నిర్దిష్టంగా గుర్తిస్తున్నప్పుడు పద్మశాలీ, కుమ్మరి, నాయీబ్రాహ్మణ, రజక, సంచార జాతులు, బీసీ ముస్లిం కులాలను అదే పద్ధతిలో ఎం దుకు గుర్తించరని ప్రశ్నించారు. ప్రత్యేక కోడ్ లేకుండా పేర్లు మాత్రమే నమోదు చేస్తే ఖచ్చితమైన కులాలవారీ జనాభా తేలదని, అనంతరం ఆ వివరాలను బహిర్గతం చేయాలని కోరారు.

బీసీలకు సమస్యలు లేకపోవ డం కాదు తమ అసలు సమస్యలేమిటో బీసీలకు తెలియకపోవడమే అతిపెద్ద సమస్య అన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చకే పరిమితం కాకుండా జనాభాలో తమ వాటా ఎంత, చ ట్టసభల్లో అధికార వాటా ఎంత అనే అంశాలపై బహుజనులు రాజకీయ చర్చ సాగించాలన్నారు. తెలంగాణలో పద్మశాలీల జనాభాకు అనుగుణంగా శాసనసభ లో వాటా లేదని పేర్కొన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలు పరస్పరం అండగా నిలవాలని కోరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్ర భుత్వాలను ప్ర శ్నించే నాయకత్వం గ్రామగ్రామం నుంచి రావాలన్నారు. అంతకు ముందు కొండా లక్ష్మణ్ బాపూజీపై యాసా రాపు రాంబాబు రాసిన వీడియో పాటను ఆవిష్కరించారు.  పి. నరహరి రచించిన ‘ఓబీసీల పోరుబాట2’ బీసీల సామాజిక, రా జకీయ చైతన్యానికి దోహదపడే రచన అని పూర్ణచంద్రరావు అభినందించారు.

పుస్తక రచయిత నరహరి మాట్లాడుతూ జనాభా బలాన్ని రాజకీయ శక్తిగా మలుచుకొని విద్య, ఉద్యోగాలు, పాలన,చట్టసభల్లో న్యాయమైన వాటా కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఎమ్మెల్సీ అనిల్ కుమార్ కూడా ప్రసంగించారు.