2 July, 2026 | 1:58 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •   మటన్‌లో గోమాంసం.. ఇద్దరు అరెస్ట్   •   శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •  

కాంగ్రెస్ విజయకేతనం ఖాయం

06-02-2026 12:48 AM

మొయినాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మొయినాబాద్  మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా  హిమాయత్ నగర్ ఎన్టీఆర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థులు గొల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్, కంజర్ల భాస్కర్ గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో అమలువుతున్న ఆరు గ్యారంటీ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పార్టీని గెలిపిస్తాయని నేతలు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల భారీ మెజారిటీకి కృషి చేయాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా రంజక పాలన చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో మాకే పట్టం కట్టబోతున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కుమార్ యాదవ్, మండల అధ్యక్షుడు మాణ్యయ్య మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.