సోనియా గాంధీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Congress leader Sonia Gandhi)ని ఉద్దేశించి బీజేపీ ఎంపీ, సినీనటి కంగనా రనౌత్(BJP MP Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో ఆమె చేసిన పోస్టు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్(Nvidia CEO Jensen Huang)కు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కంగనా ఈ అంశాన్ని ప్రస్తావించారు. గాంధీ కుటుంబంలోకి విదేశీ నేపథ్యం ఉన్న వ్యక్తి ప్రవేశించడం, ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇందిరా గాంధీ హత్య, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలను ప్రస్తావిస్తూ పలు అనుమానాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబానికి సంబంధించిన పరిణామాలపై అప్పట్లో ఎవరూ అనుమానం వ్యక్తం చేయలేదన్నట్లుగా ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా, సోనియా గాంధీ విదేశీ అజెండాకు అనుగుణంగా దశాబ్దాల పాటు ప్రభుత్వాన్ని నడిపించారంటూ ఆరోపించారు. ఆమెను చైనా గూఢచారితో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే కంగనా చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు వెల్లడించలేదు. ఇవి ఆమె వ్యక్తిగత రాజకీయ ఆరోపణలుగానే చూడాలి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.