నిరుపేద వైద్య విద్యార్థికి అండ..

25-09-2026 | 05:58pm

సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 

వెల్దండ సెప్టెంబర్ 25: నిరుపేద విద్యార్థి వైద్య విద్య చదువుకోవడానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి(TASK COO Sunkireddy Raghavender Reddy) అండగా నిలిచారు. వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి అలివేలు శేఖర్ దంపతుల కూతురు సరిత. సరిత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. కూలీ నాలి పనులు చేసి కూతురును చదివించింది. సరిత కష్టపడి చదివి వైద్య విద్య సీటు సాధించింది.

వైద్య విద్య చదవడానికి అయ్యే ఖర్చులు ఇలాగని తల్లి కూతురు దిగులు చెందుతున్నారు. వైద్య విద్య చదవడానికి సీటు సాధించిన పేదరికం అడ్డుపడిందన్న విజయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముందుకు వచ్చి లక్ష రూపాయల చెక్కు అందజేసి పేద విద్యార్థి చదువుకోవడానికి అండగా నిలిచారు.

మరిన్ని వార్తలు