90's మాస్ మ్యాజిక్ మళ్లీ రిపీట్.. 4Kలో చిరంజీవి సినిమా
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి పాత రోజుల మాస్ జోష్‌ను ఆస్వాదించే అవకాశం రాబోతోంది. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటైన ‘ముఠామేస్త్రి’ 4K వెర్షన్‌లో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 22న ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన రీ-రిలీజ్ ట్రైలర్ కూడా మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
1993 జనవరి 17న విడుదలైన ఈ చిత్రానికి ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన మీనా, రోజా కథానాయికలుగా నటించారు. రాజ్-కోటి అందించిన సంగీతం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ పాట చిరు అభిమానులకు ఇప్పటికీ ప్రత్యేకమే.
కూలీల సమస్యల నేపథ్యంలో రాజకీయ అంశాలను కూడా మేళవిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి నటన, మాస్ డైలాగ్స్, డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆధునిక 4K సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వింటేజ్ సినిమాల రీ-రిలీజ్‌లకు వస్తున్న ఆదరణ నేపథ్యంలో ‘ముఠామేస్త్రి’కి కూడా మంచి స్పందన వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి 90ల నాటి చిరు మాస్ మ్యాజిక్‌ను నేటి ప్రేక్షకులు థియేటర్లలో ఏ స్థాయిలో సెలబ్రేట్ చేస్తారో చూడాలి.