సినీ నటి అనితకు సైబర్ వల

18-11-2026 | 03:06pm

కొడుకు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాలనుకున్న ప్రముఖ సినీ నటి గోగినేని అనిత(Actress Gogineni Anitha) సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్న ఆమె.. వాషింగ్టన్‌లోని తన కుమారుడి వద్దకు వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ కోసం వెతికారు. ఈ క్రమంలో "లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్" పేరుతో రాజేష్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. అమెరికా వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ టికెట్(Business class ticket) ధర రూ.4,14,180 అవుతుందని నమ్మబలికాడు.

టికెట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీ (OTP) చెప్పాలని నటిని కోరాడు. నిజమైన ట్రావెల్ ఏజెంట్ అనుకుని అనిత తన కార్డు వివరాలతో పాటు ఓటీపీని కూడా చెప్పేశారు. కొద్దిసేపటికే ఆమె ఖాతా నుంచి 'క్లియర్ ట్రిప్' పేరిట రూ.4.14 లక్షలు కట్ అయ్యాయి. డబ్బులు కట్ అయినప్పటికీ ఎంతకీ టికెట్ వివరాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె.. తాను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు