‘ఈగో రాజా’ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
హీరో ఆది సాయికుమార్(Aadi Saikumar) మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఈగో రాజా’ టీజర్ విడుదలైంది(Ego Raja Teaser Released). తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు గురుశరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ చిత్రబృందం ప్రత్యేకత చూపించింది. తెలుగు టీజర్‌ను మాస్ మహారాజా రవితేజ() విడుదల చేయగా, తమిళ వెర్షన్‌ను విజయ్ సేతుపతి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
లోన్ యాప్ మోసాలే ప్రధాన ఇతివృత్తం
టీజర్‌ను బట్టి చూస్తే.. తక్కువ సమయంలో రుణాలు అందిస్తామంటూ సామాన్యులను ఆకర్షించి, ఆ తర్వాత వేధింపులకు గురిచేసే లోన్ యాప్‌ల వ్యవహారమే ఈ చిత్రానికి ప్రధాన నేపథ్యంగా కనిపిస్తోంది. సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తున్న ఈ సమస్యను వినోదాత్మక కథనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో సతీశ్, శరణ్య రామచంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్నారు. సామాజిక అంశంతో పాటు వినోదాన్ని మేళవించిన ‘ఈగో రాజా’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.