ప్రజా సమస్యలపై.. నిరంతరం పోరాడే పార్టీ బిజెపి పార్టీనే
- జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత లక్ష్యంగా పోరాటం..
- మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్..
- కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కప్పల శ్రవణ్ బిజెపిలో చేరిక..
జవహర్ నగర్, నవంబర్ 6 (విజయక్రాంతి): ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ నే నని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్(MP Etela Rajender) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ అంబేద్కర్ నగర్లో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కప్పల శ్రవణ్ కుమార్ పెద్ద ఎత్తున తమ అనుచరులతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ శ్రవణ్ కుమార్ వంటి క్రియాశీల నాయకులు తమ అనుచరులతో బిజెపిలో చేరడం వల్ల జవహర్ నగర్ ప్రాంతంలో పార్టీ మరింత బలోపితం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ యేనని ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు.
జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు పర్యావరణ సమస్యలపై తాము చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి సరైన గుర్తింపు గౌరవం ఉంటాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జవహర్ నగర్ బిజెపి అధ్యక్షుడు కలకోట కమలాకర్, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి , సంపత్ యాదవ్, ముత్యం సుజాత, మహేందర్ యాదవ్, రామ్ నాయక్, మాజీ ఎంపీటీసీ రషీదా బేగం, మాజీ కార్పొరేటర్ పానుగంటి బాబు, అశోక్ గౌడ్, సంతోష్ గుప్తా, జోగారావు, మహేశ్వరి గౌడ్, వెంకన్న, బాలరాజు యాదవ్, కొల్లూరి అనిల్ యాదగిరి సన్నీ, శ్యామల భవాని స్వర్ణ సాయికుమార్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.