తుమ్మిడిహెట్టిపై కాంగ్రెస్ను టార్గెట్ చేసిన హరీష్ రావు
తెలంగాణ భవన్లో (Telangana Bhavan) హరీష్ రావు మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 42 రోజుల్లోనే మహారాష్ట్రతో చర్చలు జరిపామని తెలిపారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ (Barrage) నిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఎంతో ప్రయత్నించిందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: ఫేక్ బాంబు బెదిరింపులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1,000 రోజుల తర్వాత మహారాష్ట్రతో చర్చలకు వెళ్లిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ తల దగ్గర కాకుండా తోక దగ్గర పనిచేసిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టు ముందుకు సాగలేదని ఆరోపించారు.
కొత్త ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ (Congress) దారి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతోందని హరీష్ రావు విమర్శించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వాల వైఖరిని ప్రస్తావిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన ప్రశ్నలు సంధించారు.