వార్డు సభ్యుల పట్ల నిర్లక్ష్యం వీడాలి!
గౌరవ వేతనం, ఆరోగ్య బీమా కల్పించాలి: సాల్పల విష్ణు
కోటపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) కోటపల్లి మండలంలోని గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యులకు నెలవారీ గౌరవ వేతనం, ఆరోగ్య బీమా కల్పించాలని తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి సాల్పల విష్ణు డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, గ్రామసభలు, అభివృద్ధి పనుల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పర్వతాలు యాదవ్, ఇందూరి మహేష్, కొంట్రాంగి మల్లేష్, మురళీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.