మన ఇంటికి మన బాత్‌రూమ్

26-10-2026 | 06:32pm

వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): వెంకటాపురం మండల(Venkatapuram mandal) పరిధిలోని ముకునూరు పాలెం గ్రామం(Mukunuru Palem village)లో కాఫెడ్ స్వచ్చంధ సంస్థ(CAFED Voluntary Organization) అధ్వర్యంలో మన ఇంటికి మన బాత్‌రూమ్(Mana Intiki Mana Bathroom) MNREGA – పారిశుధ్య అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాఫెడ్ స్వచ్చంధ సంస్థ డైరెక్టర్ లూర్థు రాజు ఉపాధి హామీ పథకం టీఏ. సాయిబాబు, ముకునూరు పాలెం స్కూల్ హెడ్ మాస్టర్ నాగ రాజు, గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కొప్పుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సాయిబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి  ఆరోగ్యకరమైన కుటుంబానికి తొలి అడుగు మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం ప్రతి కుటుంబ సభ్యుడి బాధ్యత. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా, ప్రతి ఇంటిలో సురక్షితమైన మరుగుదొడ్డిని నిర్మించుకొని, దానినిక్రమం.తప్పకుండాఉపయోగించడం ద్వారా మన గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మరుగుదొడ్డి వినియోగం వల్ల వ్యాధుల వ్యాప్తిని తగ్గించడంతో పాటు, మహిళలు, పిల్లలు, వృద్ధులకు భద్రత, గౌరవం కలుగుతుంది.ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి.

మరుగుదొడ్డిని ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచాలి.బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నివారించాలి. మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.ఇంటి చుట్టూ చెత్త, మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు,  గ్రామస్తులు వెంకటాపురం కోఆర్డినేటర్ జి హనుమంత్ యానిమేటర్స్ నరేష్ ప్రశాంత్ ఇందిరా పద్మ ఉషా పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు