దళితబంధు లబ్ధిదారులకు నిధులు విడుదల
ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన దళితబంధు లబ్ధిదారులు
ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండలంలో దళితబంధు పథకం కింద రెండవ విడతలో ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే రూ.2 లక్షల చొప్పున నిధులు విడుదల చేసి ఆదుకోవాలని దళితబంధు రెండవ విడత లబ్ధిదారులు కోరారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో వారు ఎంపీడీవో వినతిపత్రం సమర్పించారు. దళిత బంధు పథకం కోసం ఎంపికై పేర్లు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు నిధులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కలెక్టర్ ఖాతాలో ఉన్న నిధుల నుంచి అర్హులైన లబ్ధిదారులకు రూ.2 లక్షల చొప్పున వెంటనే విడుదల చేసి ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు న్యాయం చేయాలని, పథకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మూగల సత్యం, రామిల్ల సనీల్,తిరుపతి, చొప్పదండి సంతోష్ లు పాల్గొన్నారు.