అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు

26-10-2026 | 06:28pm

రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన కామారెడ్డి పోలీసులు

నగదు, స్కార్పియో కారు , గ్యాస్ కట్టింగ్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, మారణాయుధాలు స్వాధీనం. 

ఐదు రాష్ట్రాలు దాటి వచ్చి చోరీ చేసిన ముఠా

ఏడు నిమిషాల్లోనే గాంధారిలో ఏటీఎం చోరీ: జిల్లా ఎస్పి  యం. రాజేష్ చంద్ర

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో సంచలనం సృష్టించిన గాంధారి ఎస్బిఐ ఎటిఎం చోరీ(ATM Robbery) ముఠాలోని ప్రధాన నిందితుని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాజస్థాన్ కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఎస్బిఐ ఏటీఎంలో కేవలం 7 నిమిషాల్లో 25, 45,900 లక్షల డబ్బులు దోచుకునీ వెళ్ళిన సంఘటన విధితమే. ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 15 రోజుల్లో ప్రధాన నిందితున్ని రాజస్థాన్లో పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) తెలిపారు.

కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా వివరాలను వెల్లడించారు. ఈ ముఠా కరీంనగర్ జిల్లా కేంద్రంలో రెండు ఏటీఎంలను చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. రాజస్థాన్ నుంచి స్కార్పియో కారులో నలుగురు దొంగల ముఠా  ఏటీఎంలను టార్గెట్ గా చేసుకుని తెలంగాణలోని ప్రధాన రోడ్లపై ఉన్న ఏటీఎంల లో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడించారని తెలిపారు.

స్కార్పియో  వాహనం నెంబర్ ప్లేట్లను మార్చు కుంటూ ఈనెల 11న తెల్లవారుజామున గాంధారి మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం ను కేవలం ఏడు నిమిషాలలో గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి అందులో ఉన్న 25,45,900 ల నగదును కేవలం ఏడు నిమిషాల్లో చోరీ చేసుకుని వెళ్లినట్లు తెలిపారు. ఎస్బిఐ బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు గాంధారి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు, సిసిఎస్ సిఐ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్ప రాజ్, పోలీస్ అధికారులు కలిసి దర్యాప్తు చేపట్టారు.

చోరికి ముందు రోజు నుండి సీసీటీవీ కెమెరాలు ఇతర సాంకేతిక పారిజ్ఞానం ఉపయోగించి, అనుమానితుల కదలికలు,  స్కార్పియో వాహనం గుర్తింపు సమాచారం తోపాటు ఇతర రాష్ట్రాల పోలీసుల ను సమన్వయం చేసుకుంటూ గాలింపు చేపట్టడం జరిగిందన్నారు. పక్కా ప్రణాళికతో వచ్చి ఏటీఎం చోరీ చేసుకొని వెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏటీఎంలో లక్ష్యంగా చేసుకొని ఈ మూట చోరీలకు పాల్పడి నట్లు తెలిపారు.

ఏటీఎంలను చోరీ చేసేందుకే నల్ల రంగు మహేంద్ర స్కార్పియో వానాన్ని ఇటీవల కొనుగోలు చేసి పోలీసుల కలుగప్పెందుకు అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు గదులుగా ఇతర వాహనాల నంబర్ గల ప్లేట్లైనా మారుస్తూ చోరీలకు  పాల్పడినట్లు తెలిపారు. గత సెప్టెంబర్ 2026 కరీంనగర్ జిల్లా కేంద్రంలో రెండు ఎస్బిఐ ఎటిఎం ల వద్ద గ్యాస్ కట్టర్ శాయంతో చోరీలకు పాల్పడినట్లు విచారణలో ముఠా ప్రధాన నిందితుడు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈనెల 10న రాత్రి మరోసారి తెలంగాణకు వచ్చి ఏటీఎంలను చోరీ చేసేందుకు గాంధారి గ్రామానికి వచ్చే మార్గంలో ఒక వెల్డింగ్ షాప్ తాళం పగులగొట్టి ఆక్సిజన్ సిలిండర్ తో పాటు సంబంధిత పరికరాలను దొంగలించి గాంధారి ఎస్బిఐ ఎటిఎం వద్దకు చేరుకొని ఏడుని నిమిషాల్లోనే మాస్కులు ధరించి చోరీకి పాల్పడినట్లు తెలిపారు.

ప్రధాన నిందితుడు రషీద్ ను రాజస్థాన్లో ఈనెల 20న పట్టుకొని అక్కడి కోర్టులో హాజరు పరిచి కామారెడ్డి జిల్లా తీసుక వచ్చినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.29,400 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, నల్ల రంగు మహేంద్ర స్కార్పియో కారు, గ్యాస్ కటింగ్ నాజిల్ ఆక్సిజన్ సిలిండర్ కు సంబంధించిన పరికరాలు, రెగ్యులేటర్, చెక్ మీటర్, పైపులు ఇతర పనిముట్లు, ఇనుప రాడ్లు స్క్రూ డ్రైవర్, అడ్జస్ట్మెంట్ పాన, ఎక్సర్ బ్లేడు, వివిధ నెంబర్లు గల నంబర్ ప్లేట్లు, మాస్కులు, దుస్తులు, మూడు ఇనుప కత్తులు, ఒక ఇన్ఫరాడు స్వాధీనం చేసు కొని నిందితుడితో పాటు వస్తువులను కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రధాన నిందితున్ని పట్టుకున్న పోలీసు అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు. వారికి నగదు అవార్డులతో పాటు ప్రత్యేకంగా అభినందించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సారెడ్డి, డి.ఎస్.పి శ్రీనివాసరావు, సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు