గ్రావిటీ నీళ్లపై రాజీనామా సవాళ్లు.. హరీశ్‌ వర్సెస్‌ ఉత్తమ్‌!

26-10-2026 | 05:43pm

తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీతో నీటిని తీసుకొస్తామంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకురావచ్చని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలాగే..ఒకవేళ తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీతో నీటిని తీసుకురావడం సాధ్యం కాదని తేలితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: నేను చస్తేనే బిల్లులు ఇస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే

తుమ్మిడిహెట్టి డీపీఆర్‌లు బయటపెట్టాలి

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPRs) బహిర్గతం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం, నీటి తరలింపు సాధ్యాసాధ్యాలు, గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వాదనలను నిరూపించాలని సవాల్ విసిరిన హరీశ్ రావు, ఈ అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు