ప్రభాస్ ‘ఫౌజీ’పై వివాదం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ వార్ యాక్షన్ మూవీ ‘ఫౌజీ’ (Fauzi) టీజర్ కొత్త వివాదానికి దారితీసింది. భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhas Chandra Bose)ను టీజర్లో చూపించిన తీరుపై ఆయన మునిమనవడు చంద్రకుమార్ బోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రక వాస్తవాలను వక్రీకరించేలా సన్నివేశాలను చిత్రీకరించారని ఆరోపిస్తూ, దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi), సినిమా మేకర్స్ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ Teaserపై సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వాతంత్య్ర పోరాటం, జాతీయ నాయకుల జీవితాల ఆధారంగా సినిమాలు తీయడంలో తప్పులేదని చంద్రకుమార్ బోస్ పేర్కొన్నారు. అయితే, చరిత్రకు సంబంధించిన అంశాలను చూపించేటప్పుడు Historical Accuracy పాటించాలని స్పష్టం చేశారు. నేతాజీ, నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler) మధ్య జరిగిన సమావేశాన్ని సినిమాలో తప్పుగా చూపించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అభిప్రాయం ప్రకారం, జాతీయ నాయకుల విషయంలో వాస్తవాలను వక్రీకరించి కల్పిత అంశాలను జోడించడం తీవ్రమైన తప్పిదమని వ్యాఖ్యానించారు. ప్రభాస్ పోషిస్తున్న కల్పిత పాత్రను గొప్పగా చూపించేందుకు నేతాజీ స్థాయిని తగ్గించేలా సన్నివేశాలు ఉండకూడదని అన్నారు.
చంద్రకుమార్ బోస్ వివరణ ప్రకారం, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అవసరమైన సహాయం పొందే వ్యూహంలో భాగంగా నేతాజీ జర్మనీకి చెందిన హిట్లర్, జపాన్ నాయకుడు హిడేకి తోజోతో సంబంధాలు కొనసాగించారు. అయితే, నేతాజీ ఫాసిజాన్ని వ్యతిరేకించారని, ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులపై విశ్వాసం కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. హిట్లర్‌తో సమావేశమైనప్పుడు కూడా నేతాజీ తన స్వతంత్ర వైఖరిని కొనసాగించారని, భారత స్వాతంత్ర్యమే ప్రధాన లక్ష్యంగా వ్యవహరించారని వివరించారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పక్కనపెట్టి సంచలనం కోసం సన్నివేశాలను రూపొందించారని ఆయన దర్శకుడిపై విమర్శలు చేశారు.
మరోవైపు, ‘ఫౌజీ’ టీజర్‌పై Social Mediaలో పలువురు నెటిజన్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేతాజీ చిత్రాన్ని ఉపయోగించి సినిమాలోని ప్రధాన పాత్రను ఎలివేట్ చేయడం ఏమిటని కొందరు ప్రశ్నించగా, మరికొందరు మేకర్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో చిత్రబృందం స్పందనపై ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, టీ-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఫౌజీ’ని 2027 మార్చి 19న థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.