మీ ప్రమాణం యాప్‌లో ఉద్యోగుల వివరాల నమోదు తప్పనిసరి
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా మీ ప్రమాణం యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం మీ ప్రమాణం యాప్(Me Pramanam App)లో నమోదుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు కేవలం 19 శాఖల అధికారులు మాత్రమే యాప్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు.
మిగిలిన అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఎలాంటి జాప్యం చేయకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. మీ ప్రమాణం యాప్ ద్వారా హాజరు నమోదును పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖలు ఈ ప్రక్రియను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. యాప్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు, సలహాలు లేదా సూచనలు ఉంటే జిల్లా నోడల్ అధికారి, ఈడీఎం శ్రీకాంత్‌ను సంప్రదించాలని సూచించారు.