ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి.!

26-10-2026 | 06:40pm

- తీన్మార్ మల్లన్న

కల్వకుర్తి: విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, వ్యాపారవేత్తలుగా ఎదిగి పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) పిలుపునిచ్చారు. బీసీ రాజ్యాధికార యాత్ర(BC Rajyadhikara Yatra)లో భాగంగా సోమవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని జూపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

వారి లక్ష్యాలు, ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని సూచించారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకులుగా ఎదగాలని మల్లన్న అన్నారు. విద్య కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ మార్పునకు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు