మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయం
సన్మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలి: ఎంపీడీవో మహేశ్వరరావు
నాగల్‌గిద్ద, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని నాగల్‌గిద్ద మండల ఎంపీడీవో మహేశ్వరరావు అన్నారు. సోమవారం నాగల్‌గిద్ద మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మహేశ్వరరావు(MPDO Maheswara Rao) ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ పురాణ గాథల ప్రకారం రత్నాకరుడిగా పేరొందిన వాల్మీకి మహర్షుల బోధనలతో ఆత్మపరివర్తన చెంది గొప్ప మహర్షిగా ఎదిగారని పేర్కొన్నారు. ఆదికావ్యమైన రామాయణాన్ని రచించి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు.
మనిషి తన తప్పులను తెలుసుకుని సరిదిద్దుకుంటూ సన్మార్గంలో నడిస్తే జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని వాల్మీకి జీవితం నిరూపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మురళి, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, రాజయ్య స్వామి, సుధాకర్ రఫీ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.