ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి

13-10-2026 | 06:48pm

అభినందించిన జైనూర్ ఎస్ఐ, సీఐ మరియు పోలీస్ సిబ్బంది

జైనూర్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): పోలీసు శాఖలో(Police departments) అంకితభావంతో సేవలందిస్తున్న ముండే ఉద్ధవ్ ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందారు. గతంలో జైనూర్ పోలీస్ స్టేషన్‌లో(Jainoor Police Station) ఏఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్‌)లో ఎస్ఐగా నియమితులయ్యారు.

పదోన్నతి సందర్భంగా జైనూర్‌కు విచ్చేసిన ఆయనను జైనూర్ సీఐ, ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. జైనూర్‌లో పనిచేసిన సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజలతో మమేకమై ఆయన చేసిన సేవలను సీఐ, ఎస్ఐలు కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జైనూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు