స్వచ్ఛ కార్మికులకు దసరా కిట్ల పంపిణీ
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి):మున్సిపాలిటీ పరిధిలో(Municipality limits) పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దసరా కిట్లను మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్ లు కమిషనర్ అంజయ్య , కౌన్సిలర్ల తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
దసరా పండుగ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని నేపథ్యంలో వారికి కొత్త బట్టలతోపాటు, వివిధ రకాల రోజువారి వస్తువులతో కలిసి ప్రత్యేక కిట్ అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ పరిశుభ్రతలో వారి పాత్ర ఎంతో ఉందన్నారు. అటువంటి వారికి అండగా ఉంటామన్నారు. పండగ సందర్భంగా కార్మికుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, రాపర్తి కార్తీక్, జాడి వినోద్, సలాం, బాలకృష్ణ , డీఈ రమాదేవి, మున్సిపల్ మేనేజర్ సర్వర్, నాయకులు సాయిశ్రావణ్, దూడల అశోక్, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.