కరీంనగర్ జిల్లా జైలు సూపరిండెంట్ గా వెంకటేశం

06-11-2026 | 08:14pm

కరీంనగర్ క్రైమ్, నవంబర్ 6 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా జైలు సూపరిండెంట్ గా ఏ.వెంకటేశం(Venkatesham) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జైళ్ల శాఖ బదిలీల్లో భాగంగా కరీంనగర్ జైలు సూపరిండెంట్ విజయ్ డెని చర్లపల్లి సెంట్రల్ జైలుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బదిలీపై వచ్చిన వెంకటేశం శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా జైలు సూపరిండెంట్ బాధ్యతలతో పాటు జిల్లా సబ్ జైల్లో అధికారిగా కూడా వెంకటేశం కొనసాగనున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం బదిలీపై వెళ్తున్న విజయ్ డేని కి జైలు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

మరిన్ని వార్తలు