విబిజి రాంజీ పనులు పకడ్బందీగా నిర్వహించాలి
తాడ్వాయి, నవంబర్ 06 (విజయక్రాంతి): మండలంలో విబిజీ రాంజీ పథకం కింద నిర్వహించే పనులను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు,మేట్స్ కు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎలినినో ప్రభావంతో ప్రభుత్వం ప్రత్యేకంగా విభిజి రాంజీ పనులను ప్రవేశపెట్టిందని తెలిపారు.
ఈ పథకంలో ఫామ్ ఫండ్స్,కమ్యూనిటీ సోక్ పిట్స్,బోర్ వెల్ రీఛార్జ్ పాయింట్లు తదితర పనులపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రతి నలభై మంది కూలీలకు ఒక మీట్ చొప్పున నియమించడం జరుగుతుందని తెలిపారు. పనుల కొలతలు, ఎంబి రికార్డులు, కూలీల హాజరు తదితర విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రఘునందన్ రావు, ఏపీవో తిరుపతి, టెక్నికల్ అసిస్టెంట్లు కృష్ణ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.