ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ
తాడ్వాయి,నవంబర్,11( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామంలో(Sangojiwadi Village) ఓ లబ్ధిదారురాలు ఇందిరమ్మ ఇంటి(Indiramma House) నిర్మాణానికి ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు.గ్రామానికి చెందిన చిన్న వాడికారి అనితకు స్థానిక ఎమ్మెల్యే కే మదన్ మోహన్ రావు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.ఆమె ఇంటి నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా లబ్ధిదారురాలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గంట బాలరాజు,మాజీ సర్పంచ్ తెనుగు గంగారం,తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని శివాజీ,మైనార్టీ ఉపాధ్యక్షులు కరామత్, పారూక్,రవి,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.