టిప్పర్ ఢీకొని మహిళ దుర్మరణం

11-11-2026 | 06:45pm

నేరేడుచర్ల, నవంబర్ 11(విజయ క్రాంతి): టిప్పర్ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం నేరేడుచర్ల మండలం కేంద్రంలో(Nereducherla Mandal Headquarters) చోటుచేసుకుంది.

ఎస్సై సిహేచ్. గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా పల్లెగూడెం గ్రామానికి చెందిన బొమ్మి వెంకన్న (45) తన భార్య గురమ్మ (40), కులం చేదు బుడిగ జంగాలు, చిలక జోతిష్యం చెప్పుకుంటూ జీవించే వీరు పని నిమిత్తం బుధవారం ఉదయం మిర్యాలగూడ నుంచి హుజూర్‌నగర్ వైపు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

ఉదయం అందాజు 10.45 గంటల సమయంలో ప్రధాన రహదారి సమీపంలో ఆర్టీసీ బస్సు నిలిచి ఉండగా, వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన టీజీ 05 టీ 3101 నంబరు గల టిప్పర్ అతివేగంగా, అజాగ్రత్తగా ఓవర్‌టేక్ చేసే క్రమంలో బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వెంకన్న, ఆయన భార్య గురమ్మ రోడ్డుపై పడిపోగా, తీవ్రంగా గాయపడిన గురమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు