భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కార్యక్రమం
భూముల సరిహద్దుల నిర్ధారణే రీ-సర్వే లక్ష్యం
లింగుపల్లి, సీతారాంపల్లిలో పర్యటించిన తహసీల్దార్
దోమకొండ, నవంబర్ 6 (విజయక్రాంతి): దోమకొండ(Domakonda) మండలంలోని లింగుపల్లి, సీతారాంపల్లి గ్రామాల్లో పట్టాదారులకు భూముల రీ-సర్వేపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. భూముల వాస్తవ అనుభవం, క్షేత్రస్థాయి పరిస్థితులు, రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూముల ఖచ్చితమైన హద్దులను గుర్తించడమే రీ-సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
రీ-సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి, రికార్డులతో సరిపోల్చిన అనంతరం సంబంధిత పట్టాదారుల అభ్యంతరాలు, సమస్యలపై విచారణ చేపడతారని వివరించారు. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూముల సరిహద్దులకు సంబంధించి ఎల్‌పీఎంలు (ల్యాండ్ పార్శిల్ మ్యాప్స్) అందజేస్తారని పేర్కొన్నారు.రీ-సర్వే ప్రక్రియపై పట్టాదారులు అవగాహన కలిగి ఉండాలని, అధికారులకు అవసరమైన సహకారం అందించాలని తహసీల్దార్ సూచించారు.