ఎండిన పంటలను పరిశీలించిన బీజేపీ ఇంచార్జ్ యెండల

13-10-2026 | 07:56pm

బాన్సువాడ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ హన్మజిపేట్ కాలునాయక్ తండాలో ఎండిపోయిన వరి పంటలను బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ యెండల లక్ష్మినారాయణ(BJP constituency in-charge Laxminarayana) మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారుగా 200 ఎకరాల్లో వరి పంట ఎండిపోవడంతో రైతులు తీరా ఇబ్బందుల్లో ఉన్నారని ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి బాన్సువాడ రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్ గారు బిజెపి నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ నాగరాజ్ సాయిబాబా శివకుమార్ లక్ష్మణ్ దత్తు సంజీవులు సందీప్ సురేష్ రాథోడ్ మోహన్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు