ప్రేమ్ నగర్ ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించాలి

26-10-2026 | 06:20pm

కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ 

మహా ముత్తారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలోని ప్రేమ్ నగర్ ప్రాథమిక పాఠశాల(Prem Nagar School)ను తక్షణమే పునఃప్రారంభించాలని కోరుతూ కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ మౌర్య భూపాలపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ప్రేమ్ నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడి ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు.ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఈ విద్యా సంవత్సరం జూన్ నెల నుండి ఈ పాఠశాలను మూసివేయడం జరిగింది.

పాఠశాల మూతపడటంతో ప్రేమ్ నగర్ ప్రాంతానికి చెందిన గిరిజన (ఎస్టీ) కమ్యూనిటీకి చెందిన పేద విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. బడిలో ఉండాల్సిన చిన్నారులు పాఠశాల లేకపోవడంతో పంట పొలాలకు, కూలి పనులకు వెళ్లవలసిన దుస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మూతబడిన ప్రేమ్ నగర్ ప్రాథమిక పాఠశాలను వెంటనే తెరిపించి ఉపాధ్యాయులను కేటాయించాలని పీక కిరణ్ మౌర్య, ఐతే బాపు, జిల్లా అధికారులను కోరారు.

మరిన్ని వార్తలు