కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే జీఎంఆర్
26-10-2026 | 06:47pm
సోదరుడి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానం
పటాన్‌చెరు, అక్టోబర్ 26: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(BRS Working President KTR)ను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని కేటీఆర్‌ను ఎమ్మెల్యే జీఎంఆర్ ఆహ్వానించారు. అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్‌కు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.