XUV 3XO ZNGని ఆవిష్కరించిన మహీంద్రా
ముంబై: అగ్రగామి ఎస్‌యూవీ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ తొలి మెయిన్‌స్ట్రీమ్ సీఎన్‌జీ ప్యాసింజర్ వాహనం ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ జెడ్ఎన్‌జీని (XUV 3XO ZNG) ఆవిష్కరించినట్లు ప్రకటించింది. దీని ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. సీఎన్‌జీ, పెట్రోల్ మోడ్‌లలో 82kW శక్తితో ఇది పని చేస్తుంది.
సీఎన్‌జీ మోడ్‌లో కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0-60 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. 24.7 km/kg సామర్థ్యం ఉంటుంది. 5 స్టార్ రేటింగ్స్‌కి అనుగుణంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ మొదలైన వాటితో 35కి పైగా స్టాండర్డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. “జీరో కాంప్రమైజ్ (అస్సలు రాజీపడొద్దు) అనే స్పష్టమైన హామీతో XUV 3XO ZNG లభిస్తుంది. నేటి కస్టమర్లు ఎస్‌యూవీలో ఉండే వైశాల్యం, టెక్నాలజీ, భద్రత, డ్రైవింగ్ అనుభూతిని, అలాగే సీఎన్‌జీలో ఉండే తక్కువ వ్యయాల ప్రయోజనాలను కలిపి కోరుకుంటున్నారు.
కేటగిరీలోనే అత్యుత్తమమైన టార్క్, టర్బోచార్జ్ పనితీరు మరియు ఆకట్టుకునే సామర్థ్యాలతో సీఎన్‌జీ యొక్క ప్రాక్టికాలిటీని మరియు ఎస్‌యూవీ యొక్క ఉత్తేజభరితమైన అనుభూతిని XUV 3XO ZNG అందిస్తుంది. సీఎన్‌జీ ఎస్‌యూవీలపై కస్టమర్ల అంచనాలకు కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది ” అని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ బిజినెస్) Dr. ఆర్ వేలుసామి తెలిపారు. XUV 3XO ZNG టెస్ట్ డ్రైవ్‌లు అక్టోబర్ 15 నుంచి, బుకింగ్స్ అక్టోబర్ 20 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 20 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.