ఘనంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేసిన బీఆర్‌ఎస్ నాయకులు
గణపురం, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి(Sirikonda Madhusudhana Chary) జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గణపురం మండల కేంద్రంలో సిరికొండ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మధుసూదనాచారి నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బైరగాని కుమారస్వామి, డాక్టర్ జన్నయ్య, రత్నం రవి, కసిరెడ్డి వెంకన్న, తంగెళ్లపెల్లి వెంకట్, ఆకుల తిరుపతి, పాసికంటి రామకృష్ణ, బొబ్బాల సాంబయ్య, వీర్లసారయ్య, పులిగిల్ల సమ్మయ్య, కొత్తపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.