అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గామాత..

13-10-2026 | 05:49pm

కారేపల్లి (విజయక్రాంతి): కారేపల్లి మండలం(Karepalli Mmandal)లోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. పలువురు దంపతులు మండపాల్లో పీటలపై కూర్చుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు