యమన్ పల్లిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభం

26-10-2026 | 05:51pm

మహాముత్తారం అక్టోబర్ 26 (విజయక్రాంతి) మహాముత్తారం మండలం యమన్ పల్లి గ్రామానికి చెందిన తలారి సమ్మయ్య నూతనంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌(Fast Food Center)ను సోమవారం గ్రామ సర్పంచ్ అట్టెం రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అట్టెం రమేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం అభినందనీయమని అన్నారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడంతో పాటు కుటుంబానికి అండగా నిలవవచ్చని పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ విజయవంతంగా కొనసాగాలని, తలారి సమ్మయ్య వ్యాపారంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపా సర్పంచ్, తలారి అఖిల్, మాజీ కో ఆప్షన్ మెంబర్ నజీర్ ఖాన్, వార్డు మెంబర్ పంగా దేవేందర్, నాయకులు దుర్గం రమేష్, కొండ గొర్ల శేఖర్ రత్నం రఘు, గ్రామస్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు