54 వేల మందికి Jobs

27-11-2026 | 07:56am

ఆరు రంగాల్లో భారీ పెట్టుబడులు.. నేడు కేబినెట్ కీలక నిర్ణయాలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడుల వరద రానుందా? రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54,210 మందికి ఉద్యోగ అవకాశాలు.. 18 భారీ ప్రాజెక్టులపై నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting Today) జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే ప్రతిపాదనలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.

ఈ సమావేశంలో SIPB (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు), CRDA (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రతిపాదనలు కీలకంగా మారనున్నాయి. మొత్తం రూ.88,392 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ Investments ద్వారా 18 ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు కానుండగా, సుమారు 54,210 మందికి Employment అవకాశాలు లభించనున్నట్లు అంచనా. ఆరు కీలక రంగాల్లో భారీ పెట్టుబడులకు Green Signal లభిస్తే రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశం కూడా కేబినెట్ Agendaలో ఉండనుంది. సమావేశాల తేదీలు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. పెట్టుబడుల ప్రతిపాదనలు, ఉద్యోగాల కల్పన, అసెంబ్లీ సమావేశాలపై తీసుకునే నిర్ణయాలపై ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ Cabinet Meetingలో వెలువడే నిర్ణయాలు ఏపీ అభివృద్ధి దిశలో కీలకంగా మారనున్నాయి.

మరిన్ని వార్తలు