అంతర్జాతీయ వేదికపై మెరిసిన కరీంనగర్ అభివృద్ధి నమూనా

27-11-2026 | 03:21pm

ముకరంపుర, నవంబర్ 27(విజయ క్రాంతి)ముంబై వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన '3వ వరల్డ్ మేయర్స్ ఫోరం'(3rd World Mayors Forum) అంతర్జాతీయ సదస్సులో కరీంనగర్ నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొని, వివిధ దేశాల మేయర్లతో, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులతో భేటీ అయ్యారు. ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్ వేదికగా గత రెండు రోజులుగా ఈ సదస్సు కొనసాగింది.

ఈ అంతర్జాతీయ సదస్సుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలకు చెందిన నగరాల మేయర్లు, వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ కోలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ అంతర్జాతీయ వేదికపై కరీంనగర్ నగర అభివృద్ధి నమూనపై తమ పాలకవర్గానికి నగరపాలక సంస్థకు ఉన్న సంకల్పాన్ని వివరించామని తెలిపారు. అలాగే, ప్రపంచ స్థాయి నగరాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడిందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు