తల్లి దండ్రులను పోషించని కొడుకు

11-11-2026 | 06:05pm

జగిత్యాల, నవంబర్ 11 ( విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామానికి(Rajaram Village) చెందిన భూర్గుపెల్లి సింగరయ్య (75), రత్నమ్మ( 72) అనే అనారోగ్యం తో వృద్ధ తల్లిదండ్రులకు కొడుకు ఆంజనేయులు పోషణ, వైద్య ఖర్చులు పెట్టాలని అడుగుతుంటే కొడుతున్నాడని  జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు.

కాగా బుధవారం సీనియర్ సిటిజెన్స్ ప్రతినిధులతో వెళ్లి ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా వయో వృద్ధుల సంరక్షణ,, పోషణ చట్టం సెక్షన్ 24, సెక్షన్ 2(బి ) కింద కొడుకుపై కేసు నమోదు చేశారు. అనంతరం సీనియర్ సిటిజెన్స్ జిల్లా కార్యాలయం లో  ఆ తండ్రి తన గోడును విలేకరులకు వివరించారు. వృద్ధ 

తల్లిదండ్రులమైన మేము అనారోగ్యంతో భాద పడుతున్న పరిస్థితుల్లో తమ కొడుకు ఆంజనేయులును తమకు పోషణ, వైద్య ఖర్చులు పెట్టమని బ్రతిమిలాడితే కనికరం లేకుండా కొడుతున్నాడని, గ్రామ పెద్ద మనుషులకు చెప్పుకుంటే ప్రతి నెలా పోషణ, వైద్య ఖర్చులు ఇస్తానని ఒప్పుకున్నాకూడా పాటించక పోవడంతో పోషణ, వైద్యం కోసం పలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ పోషణ, వైద్య ఖర్చులకోసం తమ కొడుకు ఆంజనేయులు నుంచి ప్రతి నెలా రూ. 10 వేలయినా ఇప్పించాలని సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షులు, న్యాయవాది హరి అశోక్ కుమార్ సాయం తో ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని, ఎస్పీ కి సైతం ఫిర్యాదు చేస్తామన్నారు. ఆ వృద్దుల వెంట సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, చట్టం కాన్సిలియేషన్ అధికారులు పి. హన్మంత్ రెడ్డి, వెల్ముల ప్రకాష్ రావు తదితరులున్నారు.

మరిన్ని వార్తలు