సీఎం సభకు వెళ్లి వస్తుండగా.. మహిళ మృతి
20-11-2026 | 02:39pm
సిద్దిపేట క్రైం: హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన సారవ్వ అనే మహిళ రెండు బస్సుల మధ్య ఇరుక్కొని మృతిచెందింది. సిద్దిపేట(Siddipet)లో గురువారం రేవంత్ రెడ్డి సభ ముగిశాక బస్సు కోసం వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శుక్రవారం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి వెళ్లి సారవ్వ కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించారు.