రెండు లారీలు ఢీ.. యువతి ప్రాణం బలి

27-11-2026 | 01:01pm

అనకాపల్లి: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఓ యువతి ప్రాణాలను బలిగొంది(Woman Dies). రెండు లారీలు ఢీకొన్న ఘటనలో వాటిలో రవాణా చేస్తున్న ఐరన్ రేకులు రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న యువతి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు బంధువులు వెల్లడించారు.

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రేగిపాలెం జాతీయ రహదారి(Regipalem National Highway)పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో ఒక లారీలో ఉన్న ఐరన్ రేకులు(Iron Sheets) ఒక్కసారిగా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న యువతిపై అవి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే బాధితురాలిని అనకాపల్లి(Anakapalli)లోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు