వెంపటిలో కత్తులతో దాడి.. మహేష్ దారుణ హత్య

20-11-2026 | 04:40pm

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చామకూరి మహేష్ (25)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వెంపటికి చెందిన చామకూరి యాదయ్య కుమారుడు మహేష్‌పై దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. మృతుడికి భార్య ఉన్నట్లు తెలిసింది. పట్టపగలే హత్య జరగడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు (Police) విచారణ ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత కక్షలా? మరేదైనా వివాదమా? అనే కోణాల్లో దర్యాప్తు (Investigation) కొనసాగిస్తున్నారు. నిందితులు ఎవరు? హత్యకు దారితీసిన పరిస్థితులేమిటనే వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు