బల్మూరి వెంకట్ దంపతులకు గాయాలు

18-11-2026 | 12:24pm

కొత్తూరు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

కారు పూర్తిగా ధ్వంసం..

కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం ఢీకొనడంతో ఘటన 

షాద్ నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కొత్తూరు సమీపంలోని బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat), ఆయన భార్య స్వల్పంగా గాయపడ్డారు.

తిరుపతి దర్శనం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా కొత్తూరు జంక్షన్ వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వల్ప గాయాలు కావడంతో బల్మూరి వెంకట్ దంపతులు మరో కారులో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

మరిన్ని వార్తలు