రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ దుర్మరణం
18-11-2026 | 07:16pm
నవంబర్ 18, నేరడిగొండ ( విజయక్రాంతి ) : నేరడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా(Rollamamada Toll Plaza) సమీపంలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో(Road accident) గుత్పాల గ్రామ మాజీ సర్పంచ్ గస్కంటి రవి (41) దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు.
లారి ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన రవిని స్తానికులు ప్రభుత్వ అంబులెన్సులో(Government ambulance) ఆదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు అందిన సమాచారం మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నట్లు స్ ఐ ఇమ్రాన్ పేర్కొన్నారు