రెండు డీసీఎంలు ఢీ.. ఎలక్ట్రిక్ స్కూటీల వాహనం ధ్వంసం

18-11-2026 | 12:37pm

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) మాసాయిపేట సమీపంలో మంగళవారం రాత్రి రెండు డీసీఎంలు ఢీకొన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటీల(Electric Scooters)ను తరలిస్తున్న మినీ డీసీఎంను వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం(Road Accident) కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు